బాలయ్య-వెంకటేష్ పరువు నడి రోడ్డు పై పడకుండా కాపాడింది వాళ్ళేనా..? అదృష్టవంతులు అంటే వీళ్ళే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్స్ ని ఏ విధంగా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎంత పెద్ద బడా స్టార్ సెలబ్రిటీ అయినా సరే అవలీలగా బూతు పదాలతో ట్రోల్ చేసేస్తున్నారు . మెగాస్టార్ చిరంజీవి – అక్కినేని నాగార్జున- రజినీకాంత్ లాంటి స్టార్స్ కూడా అలాంటి ట్రోలింగ్స్ కు బలైపోయారు . అయితే వీళ్ళందరూ కూడా కొడుకులు కూతుర్లు విడాకుల విషయంలోనే ట్రోలింగ్కి గురవడం గమనార్హం. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం ఊపందుకుంది.

చిరంజీవి కూతుర్లు డివర్స్ తీసుకున్న కారణంగా చిరంజీవిని ట్రోల్ చేశారు అని .. రజనీకాంత్ కూతురు డివర్స్ తీసుకున్న కారణంగా రజనీకాంత్ ని ట్రోల్ చేశారు అని ..నాగార్జున కొడుకుల డివర్స్ తీసుకున్న కారణంగా ఆయనను ట్రోల్ చేశారు అని .. అయితే బాలయ్య – వెంకటేష్ లను ట్రోల్ చేయడానికి ఆ ఛాన్సే లేదు అని.. బాలయ్య కూతుర్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా రాలేదు .

అంతేకాదు తండ్రి పరువుని నడిరోడ్డుపై పడకుండా మొదటి నుంచి చాలా పద్ధతిగా పెరిగారు . ఆ కారణంగానే బాలయ్య బిడ్డలని చిన్న విషయంలో కూడా ట్రోల్ చేయలేరు అని ..అదేవిధంగా వెంకటేష్ కూడా తన కూతుర్లను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు అని .. వెంకటేష్ బాలయ్య పరువులు పోకుండా వాళ్ల పిల్లలే కాపాడారు అని .. ఆ విషయంలో నిజంగా వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని ఫాన్స్ ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు..!!