కోట్లాది మంది ఇండియన్స్ ఫేవరేట్ క్రికెటర్ షమ్మీ .. 100సార్లు చూసిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా..?

షమ్మీ..టీం ఇండియన్ క్రికెటర్ ఇతగాడికి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆఫ్ కోర్స్ ఇండియా వరల్డ్ కప్ గెలవకపోయినా సరే బ్యాట్స్ మెన్లను అల్లాడించేసింది. వరల్డ్ కప్ లోనే క్రేజీ రికార్డ్స్ నెలకొల్పిన షమ్మీ రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ఎప్పుడు క్రికెట్ గురించే మాట్లాడే షమ్మీ ఈసారి డిఫరెంట్ గా సినిమా ఫీల్డ్ గురించి కూడా మాట్లాడాడు.

ఆయన సినిమాలు చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు కేవలం హిందీ సినిమాలే కాకుండా తెలుగు స్టార్ సినిమాలు కూడా చూస్తాను అని బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ప్రభాస్ – జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటాను అని .. వాళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం అని .. ప్రభాస్ డైలాగ్ డెలివరీ బాగుంటుంది అని .. ఎన్టీఆర్ డాన్సింగ్ స్టైల్ చాలా చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు ప్రభాస్ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో షమ్మీ మాట్లాడిన మాటలను కూడా మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . బాహుబలి సినిమాను దాదాపు 100 సార్లు పైగానే షమ్మీ చూశాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో షమ్మీకి సంబంధించిన ఇదే వార్త వైరల్ గా మారింది. మొత్తానికి షమ్మీ ని మన తెలుగు స్టార్స్ యాక్టింగ్ లతో మెప్పించారు అనమాట..!!