ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన ఎన్టీఆర్ చేసిన పరమ చెత్త సినిమా ఇదే.. నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని పీడ కల ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ ఒక సినిమా కథ వినగానే ఆ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది .. ఏ విధంగా ఆడుతుంది.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్న విషయాలను టపీ టపీ మని చెప్పేస్తుంటారు . అలాంటి హీరోలల్లో ఒకరే.. మన ఎన్టీఆర్ . జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడో మనకు తెలిసిందే. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక కథ విని ఆ కథ ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన సరే ఆ సినిమా చేసి పరమ చెత్త డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు .

దానికి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా ఆయన కెరియర్ లో నచ్చని ఏకైక సినిమా ఏదైన ఉంది అంటే..అది “శక్తి”. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే చెత్త రికార్డ్స్ నెలకొల్పింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో చూస్తే జనాలు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది . సినిమాలో పెద్దగా కొత్త కాన్సెప్టే లేకపోవడం ఎన్టీఆర్ ని మరి దారుణంగా చూపించడం మెహర్ రమేష్ చేసిన పెద్ద తప్పు అంటూ అప్పట్లో జనాలు మండిపడ్డారు .

అయితే ఈ సినిమా కథ విన్న ఎన్టీఆర్ ఫ్లాప్ అవుతుంది అని ముందే గెస్ చేశారట . కానీ మెహర్ రమేష్ కి ఇచ్చిన మాట కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకొని సినిమాను ఓకే చేసి ఫైనలైజ్ చేసి మూవీలో నటించారట , దానికి భారీ మూల్యం కొన్ని సంవత్సరాలు ఎన్టీఆర్ చెల్లించుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఫ్లాప్ నుండి కోలుకోవడానికి తారక్ చాలా ఏళ్లు కష్ట పడ్డాడు..!!