పనికిమాలిన రీజన్ తో ఏకంగా మూడుసార్లు రష్మిక మందన్నా రిజెక్ట్ చేసిన.. ఆ పాన్ ఇండియా హీరో ఇతడే..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు .. ఇండస్ట్రీలో అలా స్టార్ హీరోయిన్స్ ఎవరైనా పెద్ద హీరో సినిమాలను రిజెక్ట్ చేస్తే ఆ విషయం ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వస్తూ ఉంటుంది . అయితే ఒక ముద్దుగుమ్మ .. ఒక హీరో సినిమాను ఒక్కసారి రిజెక్ట్ చేస్తేనే అది సెన్సేషన్ అవుతుంది . మరి ఒక్కే ముద్దుగుమ్మ ఒక్కే పాన్ ఇండియా హీరోను మూడుసార్లు రిజెక్ట్ చేస్తే అది నిజంగా ఒక సంచలనమే ..

ప్రజెంట్ అలాంటి వార్త నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఒక హీరోని మూడుసార్లు రిజెక్ట్ చేసింది అన్న వార్త వైరల్ అవుతుంది . ఆయన మరెవరో కాదు దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న నాని . నానితో మూడు సినిమాల్లో నటించే ఛాన్స్ లను మిస్ చేసుకునింది రష్మిక మందన్నా అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

రష్మిక మందన్నా .. పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ దక్కించుకునింది . అయితే కొన్ని కొన్ని సార్లు ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమెకు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి . దసరా సినిమాలో ముందుగా రష్మిక మందన్నా నే హీరోయిన్గా అనుకున్నారట . కానీ ఆమె ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసింది . ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో కూడా ఆమెను హీరోయిన్గా అనుకున్నారట. ఆ ప్రాజెక్టును చెత్త రీజన్ తో క్యాన్సిల్ చేసుకుంది . ఫైనల్లీ సరిపోదా శనివారం సినిమాలో ఆమెను మెయిన్ హీరోయిన్ గా అనుకున్నారట . ఆ పాత్రను ఆమె రిజెక్ట్ చేసింది . ఇలా మూడుసార్లు చెత్త రీజన్ తో నాని సినిమాను రిజెక్ట్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది రష్మిక మందన్నా..!!