టాలీవుడ్ బ్యూటీ ‘ పూజా హెగ్డే ‘ ఇంట తీవ్ర విషాదం..

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పూజ హెగ్డే తన అమ్మమ్మ‌ను కోల్పోయింది. ఆమెకు అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టమని.. తనను ప్రాణంగా చూసుకునేదని తెలుస్తుంది. పూజ హెగ్డేకు ఎంత ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోవడంతో ఆమె ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. పూజ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందట. అంతేకాదు గతంలో ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలను పూజ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

ఐ మిస్ యు అమ్మమ్మ అంటూ ఎమోషనల్ కామెంట్స్ తో ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేసిన బుట్ట బొమ్మ.. ఆమె మరణంతో ఏంతో బాధ ప‌డుతున్న‌ట్టు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో పూజను అభిమానులంతా ఓదారుస్తున్నారు. రెండు రోజుల క్రితమే పూజా హెగ్డే ఇంట ఆమె చెల్లి భూమి శెట్టి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ పెళ్లిలో తన ఫ్యామిలీతో కలిసి పూజ బాగా ఎంజాయ్ చేసింది. ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండానే తమతో పాటు పెళ్లిలో సంతోషంగా గడిపిన అమ్మమ్మ సడన్గా చనిపోయింది.

దీంతో ఫ్యామిలీ అంతా పూర్తిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక పూజ హెగ్డే ప్రస్తుతం సినిమాలు లేక చాలా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం నుంచి తప్పుకున్న పూజ.. సల్మాన్‌తో కిసిక జాన్ బాలీవుడ్ మూవీలో నటించిన ఆ మూవీ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు ఏమీ లేవు. తెలుగులో ఇప్పటివరకు కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. దీంతో పూజా హెగ్డే కు అసలు కలిసి రావడం లేదని ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ గా క్రేజ్ ను తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకుబ్యాడ్ టైమ్ న‌డుస్తుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.