రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్ మేకర్స్.. ఎంత విరాళం ఇచ్చారంటే..?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జ‌ హీరోగా నటించిన హనుమాన్ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్‌లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రతి చోట పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హనుమాన్ ప్రస్తుతం దూసుకుపోతుంది. గురువారం పెయిడ్ ప్రామియర్లతోనే ఈ మూవీకి అద్భుతమైన టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. కాగా హనుమాన్ సినిమాకు అమ్మడయ్యే ప్రతి టికెట్ నుంచి 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని మూవీ టీం ఎప్పుడో ప్రకటించారు.

Telugu Film HanuMan's Makers To Donate Rs 5 From Every Ticket To Ayodhya Ram Temple - News18

ఇచ్చిన మాట ప్ర‌కారం తొలి విడత విరాళాన్ని రామ మందిరానికి సమర్పించారు మేకర్స్. హనుమాన్ సినిమా ప్రీమియర్ల నుంచి వచ్చిన కలెక్షన్ నుంచి అయోధ్య రామ మందిరానికి తొలి విడత విరాళం అందింది. ఇప్పటివరకు అమ్మడైన ప్రతి టికెట్ పై ఐదు రూపాయల చొప్పున.. ప్రీమియర్ల నుంచి వచ్చిన కలెక్షన్లతో రూ.14,85,810 చెక్ ను అయోధ్య శ్రీ రామ క్షేత్రానికి టీమ్ అందించారు. హీరో తేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, హీరోయిన్ అమృత అయ్యర్ ఈ చెక్ నమూనా ప‌టుకున్ని ఉన్న ఫోటోను మేకర్స్ పోస్ట్ చేశారు.

Karnataka's connection with construction of Ram temple in Ayodhya | Karnataka News - News9live

పెయిడ్ ప్రీమియర్లలో 2,97,162 టికెట్లు అమ్ముడు అయ్యాయని సమాచారం. ఇక హనుమాన్ సినిమా ధియేటర్లో ఆడినన్ని రోజులు ప్రతి టికెట్ కి 5 రూపాయలు చొప్పున ప్రతిరోజు వచ్చిన కలెక్షన్ల నుంచి అయోధ్య రామ మందిరానికి విరాళం వెళుతుందని.. ప్రతిరోజు ఎంత మొత్తంలో విరాళం అందిందో ప్రేక్షకులకు కూడా తెలిసేందుకు ఓ వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించారు. విరాళం అందించిన ఫోటోను హనుమాన్ మేకర్స్ ప్రకటించగా క్షణాల్లోనే ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.