దేవుడిగా మారిన మహేష్ బాబు.. కలకలం రేపుతున్న ఫోటో..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ” గుంటూరు కారం ” తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్ సొంతం చేసుకుంది.

ఇక దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే.. అమలాపురం మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. కృష్ణుడి రూపంలో ఉన్న పిక్స్ ని ఏర్పాటు చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం అని రాసి పెట్టారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే కొన్ని చోట్ల అభిమానులు రోడ్లు బ్లాక్ చేసి మరి ప్రయానులకు ఇబ్బంది కలిగించేలా ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.