మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన మూవీ “గుంటూరు కారం “. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, శ్రీ లీల డ్యాన్స్ తప్ప ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో రివ్యూస్ వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు ముందు నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ తీరా చూస్తే సినిమాలో మాత్రం ఏమీ లేదు. ఇక మొదటి నుంచి ఈ సినిమా రూ. 50 కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్న కామెంట్స్ వినిపించాయి.

కానీ మహేష్, త్రివిక్రమ్ మాత్రం 100 కోట్లు సాధిస్తుందని భావించారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ 38.7 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక సెకండ్ డే లెక్కలు మరింత మారే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. మరి రానున్న రోజుల్లో పికప్ అవుతుందో లేదా డేల పడిపోతుందో చూడాలి మరి.