దేవాలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?

యంగ్ రెబల్ స్టార్ చాలా రోజులకు బయటకు వచ్చాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ అందరికీ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇక‌ అసలు బయట పెద్దగా కనిపించని హీరో ప్రభాస్ ఇలా దైవ సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ ప్రభాస్ గురించి పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌ద్యంలో ఇంతకీ ఆ ప్రత్యేక పూజలకు కారణమేంటి అనే అంశంపై ప్రేక్ష‌కుల‌లో సందేహాం మొదలైంది.

Salaar Prabhas Visits Sri Durga Parameshwari Temple | Kateel | Mangalore -  YouTube

కాగా దాని వెనుక కూడా ఒక కారణం ఉందని తెలుస్తుంది. ఇంతకీ అదేంటో ఒకసారి చూద్దాం. ఇటీవల ప్రభాస్ స‌లార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్గా నిలిచింది. అయితే సినిమా ప్రమోషన్స్ లో కూడా ఓ ఇంటర్వ్యూలో మాత్రమే కనిపించి సరిపెట్టేసిన ప్రభాస్.. బయట ఎక్కడ పెద్దగా కనిపించలేదు. మధ్యలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ ఒకటో, రెండో ప్రభాస్ ఫోటోలు బయటకు వచ్చేసరికి ఫ్యాన్స్ దానితో ఆనందపడ్డారు.

Prabhas Seek Divine Blessings at Kateel Sri Durgaparameshwari Temple

తాజాగా సలార్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఈ సెలబ్రేషన్స్ జరిగింది. ఈ నేపథ్యంలో కర్ణాటక వెళ్ళిన ప్రభాస్ మంగళూరులోని శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు. వైట్ క్యాప్, మాస్క్ ధరించిన ప్రభాస్ సలార్ ప్రొడ్యూసర్ విజయ్‌కిరంగదూర్ తో కలిసి ఆలయాన్ని సందర్శించాడు. అలానే స్పెషల్ పూజలు కూడా చేయించుకున్నాడు. సలార్‌ సినిమా సక్సెస్ అయినందుకు ఈ పూజలు చేయించినట్లు సమాచారం. ఇక ఇటీవల ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ ఏడాది మే9న కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది.