” సైంధవ్ ” టీం కి ఆల్ ది బెస్ట్ తెలియజేసిన స్టార్ డైరెక్టర్.. ఇక మీ సినిమా హిట్ అవ్వాల్సిందేగా..!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” సైంధవ్ “. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ప్రస్తుతానికి అయితే ఈ సినిమా గురించి ఎటువంటి టాక్ వినబడడం లేదు.

మరి కొద్ది సమయంలో ఈ సినిమా హిట్టా? సట్టా? అనేది తెలిసిపోతుంది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి బెస్ట్ విషెస్ తెలియజేశాడు. ” ఈ సంక్రాంతి విజయవంతంగా ఉంటుంది.

హీరో వెంకటేష్ గారికి, శైలేష్ కొలను కి మరియు చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలి అని భావిస్తున్నా ” అంటూ ఓ ట్వీట్ ద్వారా విషెస్ తెలియజేశాడు అనిల్ రావిపూడి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, ఆర్య, ముఖేష్ రిషి తదితరులు కీలక పాత్రలలో వహించారు.