సొంత థియేటర్లోనే ” గుంటూరు కారం ” షో క్యాన్సిల్.. కారణం ఇదే..!

2024 సంక్రాంతి కానుకగా గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ గుంటూరు కారం మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాసులు అయ్యాయనే చెప్పొచ్చు. ఇక ఇదే సమయంలో హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సాధించింది.

ఇక దీంతో సూపర్ స్టార్ అభిమానులంతా డీల పడిపోయారు. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. మహేష్ సొంత మల్టీప్లెక్స్ లో గుంటూరు కారం షో క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హనుమాన్ స్పీడ్ పెరగడంతో గుంటూరు కారం సినిమాకు ఎదురు దెబ్బ తగిలింది.

ఏకంగా మహేష్ సొంత మల్టీప్లెక్స్ AMB సినిమాస్ లో మొదటి రోజే గుంటూరు కారం సినిమా క్యాన్సిల్ అయింది. కొత్తగా యాడ్ చేసిన 1 PM స్లాట్ కు బుకింగ్స్ లేకపోవడంతో షో క్యాన్సిల్ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన సొంత మల్టీప్లెక్స్ లోనే పెద్ద దెబ్బ తగిలింది అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీని గురించి మల్టీప్లెక్స్ నిర్వాహకులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.