బుక్ మై షోలో దుమ్ము రేపుతున్న ” హనుమాన్ “…!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తాజాగా తెరకెక్కిన ల‌మూవీ ” హనుమాన్ “. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక గుంటూరు కారంతో పోటాపోటీగా రిలీజ్ అయి మహేష్ సినిమాని పక్కకి నెట్టి భారీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది హనుమాన్.

ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్ షోలకి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆడియన్స్ ఈ సినిమాకి మొదటి రోజు నుండే థియేటర్లకి క్యు కట్టారు. అయితే ఈ సినిమా బుక్ మై షో లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 9.7 రేటింగ్స్ తో దూసుకుపోతుంది హనుమాన్. ఇక తేజ సజ్జ యాక్టింగ్ తో పాటుగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఆడియన్స్ను బాగా అలరిస్తుంది.

ఇక ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలకపాత్రలలో వహించారు. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెయిడ్ ప్రీమియర్ షోలకి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.