వెంకీ ” సైంధవ్ ” మూవీతో శైలేష్ కొలను హ్యాట్రిక్ హిట్ కొడతాడా.. లేదా మహేష్ లాగా ఆశలు అడియాసలు చేస్తాడా..!

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన విలక్షణ నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక వెంకి తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెంకీ కెరీర్లో 75వ సినిమా. ఇక ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు.

ఇక దీంతో ఈయనకి మంచి పేరు సైతం లభించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి యుగ దర్శకుడు పైనే ఉంది. సైంధవ్ తో శైలేష్ హ్యాట్రిక్ సాధిస్తాడా? వెంకటేష్ తన 75వ సినిమాతో మరుపురాని హిట్ కొడతాడా? లేదా మహేష్ లాగా అసలు అడియాసలు చేస్తాడా? అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఇక నేడు రిలీజ్ అయిన ఈ మూవీ ఏ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి మరి.

ఈ సినిమా కనుక హ్యాట్రిక్ హిట్ అయితే వెంకటేష్ మరి కొన్నేళ్లు సినిమా రంగంలో హీరోగా కొనసాగవచ్చు. లేదంటే 75వ సినిమాతోనే బ్రేక్ పడవచ్చు. ఇక నవాజుద్దీన్ సిద్దిఖీ , శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా , ఆర్య, ముఖేష్ రిషి, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాని నిర్మించారు.