సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న శివాజీ ” 90s ” వెబ్ సిరీస్..!

హీరో శివాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన శివాజీ ప్రస్తుతం పెద్ద సినిమా అవకాశాలు రాకపోవడంతో.. బిగ్ బాస్ అనే షోలో పాల్గొన్నాడు. ఇక ఈ షో తో శివాజీ మరోసారి పాపులర్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన అనంతరం శివాజీ ” 90s middle class biopic ” అనే సిరీస్లో పాల్గొన్నాడు.

ఈ సిరీస్ ని ఆదిత్య హాసన్ మౌళి, వసంతిక, రోహన్ రాయ్ కీలక పాత్రలలో నటించారు. అలాగే నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం ఈ సిరీస్ ని గ్రాండ్గా నిర్మించారు. ఇక ఈనెల ఐదో తారీఖున రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ భారీ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.

ఈ సిరీస్ ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ మధ్యమం ఈటీవీ విన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా ఈ సిరీస్ 120 మిలియన్ న్యూస్ సొంతం చేసుకుని సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక 90s సిరీస్ కి ప్రముఖ ఇంటర్నెట్ మూవీ డేటా బెస్ట్ ( IMDB ) లో 9.6 రేటింగ్ లభించింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.