” సైంధవ్ ” ప్రీమియర్ షో రివ్యూ.. వెంకీ మామ బొమ్మ హిట్టా.. ఫట్టా.. ?!

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్.. తెరకెక్కుతుంది. హిట్ 2 ఫ్రేమ్ శైలేష్ కొల‌ను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూహిణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియ జ‌ర్మియా, ఆర్య‌ కీలకపాత్రలో నటించారు. నవాజుద్దీన్ సిద్ధికి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సంక్రాంతి బరిలో జనవరి 13న ఈరోజు సైంధవ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్లో వెంకటేష్ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ మార్క్ ఎమోషన్స్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ప్రాధాన్యతను పుంజుకుంది.

Latest Update From "Saindhav" Teaser

ఆల్రెడీ యుఎస్ ప్రీమియర్ షోలు మొదలైన నేపథ్యంలో సినిమా కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. 140 నిమిషాలు న‌డివితో సాగే ఈ సినిమా చంద్ర ప్రస్తాలో క్రైమ్ పార్ట్స్ సన్నివేశంతో మొదలవుతుంది. ఇక ఫస్ట్ 30 నిమిషాల వరకు సినిమా చాలా స్లోగా రన్ అవుతుంది. తర్వాత వెంకీ యాక్షన్స్ సీన్స్‌ మొదలైన తర్వాత మూవీ పిక్స్ లో ఉంటుంది. కథ కూడా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇక్కడ నుంచే ట్విస్ట్ మొదలవుతుంది. యాక్షన్ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యం. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తుసంసుమ‌నిపించింది.

పవర్ఫుల్ ఎలివేషన్స్ రావలసిన సమయంలో కూడా బిజీఎం సపోర్ట్ అందలేదు.. అని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్వెల్‌ తర్వాత కథ కాస్త ఆసక్తిగా మారిందని.. కానీ శైలేష్ కొలను బలమైన సన్నివేశాలను కూడా చూపించారు.. దీంతో యాక్షన్ థ్రిల్లర్ కి ఉండాల్సిన ఇంపాక్ట్ అనిపించలేదు.. యాక్షన్ ఎపిసోడ్‌లో వెంకటేష్ పెర్ఫామెన్స్ ఎప్పుడు చూడని విధంగా ఆకట్టుకుంది. కథలో మెయిన్ పాయింట్ చాలా బలంగా ఉంది. దాని చుట్టూ అద్భుతమైన సన్నివేశాలు రాబట్టవచ్చు.. కానీ శైలేష్ ఆ విధంగా చేయలేదు.

Victory Venkatesh Saindhav project awaits Sankranti release

స్టోరీ చెప్పిన విధానం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సెంటిమెంట్ సీన్లతో కూడా వెంకటేష్ ఆకట్టుకున్నారు. కానీ అక్కడ కూడా బీజీఎం దెబ్బేసింది.. సైంధవ్‌ సినిమాకి మ్యూజిక్ బాగా మైనస్ అయ్యింది. క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వెంకటేష్ సినిమాలో ఫుల్ ఆఫ్ యాక్షన్ అవుతార్‌లో కనిపించాడు.. తర్వాత ఎమోషనల్ సీన్స్ లో స్విచ్లు కాస్త మారినట్లు అనిపించినా బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంది. అయితే వెంకీ 75వ సినిమా మార్క్ ఎఫెక్ట్‌ అయితే లేదు. టోటల్‌గా సైంధవ్ యావరేజ్ అని చెప్పాలి.