‘ సైంధవ్ ‘ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అవతార్ అదుర్స్.. కానీ..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొల‌ను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియా జ‌ర్మియా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 13న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడడంతో సైంధవ్ టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో నెటిజన్స్ అంతా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమాలో నో బీఫ్.. డైరెక్ట్ గా బూతులు వినిపిస్తున్నాయి ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక రిలీజ్ కి ముందు వెంకీ మామ సైంధవ్ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా బజ్‌ ఏర్పడింది.

Saindhav Twitter Review: సైంధవ్ ట్విటర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అదుర్స్.. కానీ, అదొక్కటే మైనస్!-saindhav movie twitter review and venkatesh action superb ,ఎంటర్‌టైన్‌మెంట్ ...

సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికపై ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి చూద్దాం.వెంకీ మామ భయపెట్టేస్తున్నాడు.. ఓమైగాడ్ అనేలా కనిపించాడు.. ఫుల్ వైలెన్స్.. ఆర్ఆర్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. నటనతో ఆకట్టుకున్నాడు ఈ సినిమా ఒకసారి అయితే చూడవచ్చు అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ డీసెంట్ గా ఉంది. ప్రారంభంలో చాలా నీరసంగా.. నిదానంగా కథ మొదలైంది.. ఓ 30 నిమిషాల తర్వాత కథ‌ పరుగులు తీయడం మొదలు పెట్టింది. యాక్షన్ సీక్వెన్స్, పర్ఫామెన్స్ లతో వెంకి ఆకట్టుకున్నాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ.. ఇంకా చేసే స్కోప్ ఉంది అనిపించింది. ఆశించిన రేంజ్ లో అయితే సినిమా లేదు. సెకండ్ హాఫ్ అంత ఎఫెక్టివ్ గా లేదు అంటూ మరో నెటిజన్ త‌న‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Saindhav Review, Saindhav Movie Review

సైంధవ్‌ నాకు డీసెంట్ అనిపించింది. వెంకీ మామ చేసిన కొన్ని సీన్లు, క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా అనిపించాయి. ఒక్కసారి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఊహించిన రేంజ్ లో అయితే సినిమా అంచనాలను అందుకోలేదు. కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు అంటూ మరో నెటిజన్ వివరించాడు. ఇప్పుడే షో అయిపోయింది ఎమోషనల్ పార్ట్‌, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి స్టోరీ అంతా ఎమోషనల్ అనిపించింది ఆ లైన్ మాత్రమే బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఊహించిన రేంజ్ లో లేవు. వెంకీ ఇంటిలిజెంట్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. టోటల్గా యావరేజ్ అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

సలార్‌ ఎఫెక్ట్‌.. వెంకటేశ్‌ 'సైంధవ్‌' విడుదలలో మార్పులు | Venkatesh Saindhav Movie Team Announced New Release Date For This Reason, Interesting Deeets Inside - Sakshi

ఇక టోటల్‌గా వెంకీ మామ ఫాన్స్ అయితే సినిమా బాగుందని.. పెద్దోడు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని విశ్వరూపం చూపించాడు అంటూ.. చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం సైంధవ్‌ను ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో సైంధవ్‌ నిలిచినట్లే అనిపిస్తుంది. కాని యావరేజ్ స్టాప్ అని అర్థమవుతుంది. ఫైనల్ గా వెంకీ మామ ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాడట. ఇక బాక్సాఫీస్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి.