త్రివిక్రమ్  ఒక్కటి ఆ ఒకే ఒక్కటి మార్చి ఉంటే … గుంటూరు కారం ఘాటు గట్టిగా దిగిపోయుండేదిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొన్ని కొన్ని చేంజెస్ చేసుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదా..? అంటే అవును అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమా నేడు థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది .

సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ ఓకే ..ఒకసారి థియేటర్లో చూడొచ్చు . అంతవరకే .. మహేష్ బాబు కెరియర్ లో సంచలనం సృష్టిస్తుందా..? అంటే నో అని చెప్పాలి . అయితే గుంటూరు కారం కి కాంపిటీషన్గా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా మాత్రం చరిత్ర సృష్టించింది . ఎటువంటి సపోర్ట్ లేకపోయినా చిన్న బడ్జెట్ తో భారీ వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ తో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు ప్రశాంత్ వర్మ .

తేజ నటన కూడా ఈ సినిమాకి హైలైట్ గా మారింది . ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా కథ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే మహేష్ బాబు ఇప్పుడు ట్రోలింగ్ కి కూడా గురి అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ అప్పుడు గుంటూరు కారం అందరికీ ఘాటుగా దిగిపోయి ఉండేది అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??