‘ హనుమాన్ ‘ మూవీ ఎఫెక్ట్.. సెకండ్ డే థియేటర్ల ట్విస్ట్..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ చూసినా హనుమాన్ మూవీ పేరు చర్చ‌నీయంసంగా మారింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ‌ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని సెంటర్ లోను బ్లాక్ బస్టర్. స్టార్‌ హీరోల సినిమాలను క్రాస్ చేస్తే దూసుకుపోతుంది. టాలీవుడ్ యంగ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మొదట తెలుగు సూపర్ మాన్ స్టోరీ కావడంతో రిలీజ్ కి ముందే భారీ హైప్‌ నెలకొంది.

ఈ సినిమాకు రిలీజ్ తర్వాత విజువల్స్, కథ, క్లైమాక్స్, ఇంటర్వెల్ అన్ని అదిరిపోయాయి అంటూ పాజిటివ్ రివ్యూలు వినిపించాయి. మళ్లీ మళ్లీ చూడాలని ఉంది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీ కి పెరిగిన క్రేజ్ రీత్యా థియేటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అదనపు దియేటర్లు దక్కాయి.

వసూళ్లు కూడా భారీగా పెరగనున్నాయి. తొలి రోజు కన్నా రెండో రోజు ఈ సినిమా మరింత కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఫస్ట్ రూ.15 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా చూసేందుకు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ కూడా ఎక్స్ట్రా షో వేసేందుకు ప్లాన్ చేశారు. ఇదే గనుక జరిగితే మూవీ అడ్వాన్స్ బుకింగ్ లోను భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.