‘ సైంధవ్ ‘ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఈసారి కూడా వెంకీ మామ హిట్ కొట్టినట్టే..

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో లాంగ్ గ్యాప్ తర్వాత సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు వెంకి మామ‌. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ మాఫీయా అంశాలను టచ్ చేస్తూ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇక తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీల కోసం బుధవారం ఈ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్క్రీనింగ్‌కు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందట. సినిమా చూసిన వారంతా అవుట్ ఫుట్ విషయంలో హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుస్తుంది.

వెంకటేష్ క్యారెక్టర్, యాక్షన్ సీక్వెన్స్, ఫ్యామిలీ బాండింగ్ ఎపిసోడ్స్ అన్ని చాలా బాగా కుదిరాయని ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. సినిమాలో సింగిల్ డెల్ మూమెంట్ కూడా కనిపించలేదట. సైంధవ్‌ సినిమాలో గ్యాంగ్ స్ట‌ర్‌గా, ఓ చిన్నారికి తండ్రిగా, డిఫరెంట్ షేడ్స్ లో వెంకటేష్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో శ్ర‌ద్ధ‌ శ్రీనాథ్ తో పాటు రూహిణి శర్మ, ఆండ్రియా, తమిళ్ హీరో ఆర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖ్ విల‌న్ రోల్‌ప్లే చేస్తున్నాడు. వెంకటేష్, నవాజుద్దీన్ మధ్యన జరిగే యాక్షన్ సన్నివేశాలు అయితే అద్భుతంగా వచ్చాయని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం తెలుగులో నవాజుద్దీన్ తన సొంత డబ్బింగ్ చెప్పుకున్నాడట. ఇక సైంధవ్‌ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. వెంకటేష్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. తన 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్‌ ఏర్పడింది. ఈ సినిమా థియేట్రిక‌ల్‌ బిజినెస్‌లు కూడా బాగానే జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో ఈ మూవీ రాన్నుంది. ఇక సైంధవ్‌ తో కచ్చితంగా వెంకి మామ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.