అయ్యయ్యో..అమ్మ లాంటి హీరోయిన్ తో రోమాన్స్ చేసిన మహేశ్ బాబు.. వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ కంటే నెగెటివిటీనే ఎక్కువగా పెరిగిపోయింది . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఎలా ట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం .రీసెంట్గా మహేష్ బాబును కూడా వదలడం లేదు ట్రోలర్స్ . మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే రిలీజ్ కాబోతుంది . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తనదైన స్టైల్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు .

కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ మహేష్ బాబుకి తల్లి పాత్రలో కనిపించబోతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఆ విషయాన్ని చూపించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . అయితే గతంలో మహేష్ బాబు రమ్యకృష్ణ ఓ సాంగ్ లో రెచ్చిపోయిన క్లిప్స్ ను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . నాని సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చింది. అందులో ఓ పాటలో కూడా నటిస్తుంది. ఆ పాటలో మహేష్ రమ్యకృష్ణ హద్దులు మీరి పోతారు .

హాట్ రొమాన్స్ కూడా చేస్తారు . మార్కాండేయ అంటూ సాగే ఈ పాటలో మహేశ్ ని మనం ఇది వరకు ఎప్పుడు చూడని రేంజ్ లో చూస్తాం. దానికి సంబంధించిన పిక్చర్స్ ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు . రమ్యకృష్ణ గుంటూరు కారంలో ఆయనకు తల్లిగా నటిస్తుంది . ఈ క్రమంలోనే తల్లి లాంటి హీరోయిన్ తో కూడా రొమాన్స్ చేశావా అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు జనాలు..!!