‘ హనుమాన్ ‘ ఫస్ట్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధంగా ఉన్నాయి. స్టార్ హీరోల మధ్య జరుగుతున్న ఈ సంక్రాంతి పోరు పై తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్ గా నిలిచేది ఎవరు అనే ఎగ్జిట్మెంట్ ప్రతి ఒక్కరిలోను కనిపిస్తుంది. ముఖ్యంగా తేజ హీరోగా నటిస్తున్న సూపర్ హీరో మూవీ హనుమాన్ పై ప్రేక్షకుల దృష్టంత‌ ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వ‌స్తున్న‌ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అక‌టుకున్నాయి. అందులో విజువల్స్ మెస్‌మ‌రైజ్ చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామని క్యూరియాసిటీతో ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. మరో పక్క గుంటూరు కారం, సైంధవ్‌, నా సామి రంగ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా బ‌రిలో ఉండడంతో హనుమాన్ లాంటి చిన్న సినిమాపై సింపతి యాంగిల్ కూడా ఉంది. ఈ ధైర్యంతోనే హనుమాన్ మేకర్స్ ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా కొంతమంది సినీ ప్రముఖుల కోసం హనుమాన్ మూవీ స్పెషల్ షోలు జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఆషో ద్వారా మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది.

సినిమా చూసిన వాళ్లంతా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. హనుమంత్ అనే కుర్రాడు హనుమంతుడు అనుగ్రహంతో పుడితే అతని సూపర్ నాచురల్ పవర్స్ ఎలా ఉంటాయి.. అన్నదే ఈ సినిమా స్టోరీ అని సమాచారం. హనుమాన్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుందట.. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంద‌ని సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ని మించి ఉంటుందని తెలుస్తోంది. అక్కడక్కడ డల్ అనిపించిన సినిమా విజువల్స్ మూవీని ఎత్తులో నిలబెట్టాయని చెప్తున్నారు. గెటప్ శీను కామెడీ హైలెట్ గా ఉండబోతుందట.

సత్య, వెన్నెల కిషోర్ కూడా బాగా నటించారని విలన్ వినయ్ రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. ఇక సినిమాకు ఓ కోతి రోల్ కు రవితేజ వాయిస్ ఓవర్ అందించారు. ఈ సినిమాలో చిరంజీవి కళ్ళను కూడా ఓ సన్నివేశంలో వాడారు. మ‌రీముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను ఇంకో ప్రపంచానికి తీసుకెళ్లడట ప్రశాంత్ వ‌ర్మ. హనుమంతుడే ప్రత్యక్షమైనప్పుడు అందరూ స్టన్ అయిపోవడం మాత్రమే కాకుండా.. తెలియకుండానే ప్రేక్షకులంతా చెప్పులు తీసి పక్కనపెట్టి మరీ భక్తిని చాటుకుంటారని ఆ రేంజ్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.