అల్లు అర్జున్ పై ఇంత చెత్త రూమరా.. ఏం మనుషులు రా నాయనా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలపై అయితే చాలామంది జనాలు రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . రీసెంట్గా అల్లు అర్జున్ కి సంబంధించి ఒక పరమ చెత్త రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోయారు . ఫైనల్లీ అది రూమర్ అని తేల్చేశారు.

అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. పుష్ప 1 తో ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న బన్నీ పుష్ప2 తో గ్లోబల్ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . అయితే పుష్ప2 సినిమా షూటింగ్ పెండింగ్లో ఉందని.. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కాదు అంటూ పలువురు ఫేక్ వార్తలను క్రియేట్ చేశారు.

దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ డీలా పడిపోయారు. అసలు విషయం ఏంటో అని ఆరాధిస్తే అటువంటిది ఏదీ లేదు అని పుష్ప టీమే క్లారిటీ ఇచ్చింది . ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అంటూ మరొకసారి అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో బన్నీ ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కావాలనే ఎవరో చెత్త వెధవలు ఈ సినిమా పై బురద చల్లడానికి ఇలా ట్రై చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు..!!