బిజినెస్ మాన్ తో పెళ్లి పై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన అంజలి.. నాకు చాలామందితో అలా అంటూ కామెంట్స్..!

యంగ్ బ్యూటీ అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ రాకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వ‌ర‌న‌ ఆఫర్లు అందుకుంటూ స్టార్ డమ్‌ సంపాదించుకుంది కూడా.

ఇక ఈ క్రమంలోని ఫ్యామిలీతో ఏడో గొడవలు జరగడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసింది. అయితే ఇటీవల అంజలి ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి తన పెళ్లిపై ఆసక్తికర కామెంటులో చేసింది. ఈమె మాట్లాడుతూ..” సినిమా రంగంలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు.

దీంతో నన్ను ఎవరితో కలిపి రాయాలనేది తెలియక కొందరు వేరే సొంతంగా నిర్ణయించుకుని రాస్తున్నారు. మొదట్లో హీరో జైను ప్రేమించినట్లు రాశారు. ఇప్పుడు ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటున్నానని రాస్తున్నారు. నాకు తెలియకుండానే పెళ్లి చేసుకుంటాం అనేది నాకు నవ్వు వస్తుంది ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంజలి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.