అలోవెరా తో పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..!

సాధారణంగా చాలామంది అలోవెరా జల్ ను మొహానికి అప్లై చేస్తూ ఉంటారు. కానీ అలోవెరా జెల్ ఒక ఫేస్కే కాదు హెయిర్ కి కూడా బాగా పనిచేస్తుంది. తాజా అలోవెరా జెల్ ను నేరుగా కుదుళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తరువాత క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి జుట్టు పొడవుగా పెరుగుతుంది.

అలానే అలోవెరా జెల్లో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి హెయిర్ మసాజ్ చేసుకోవచ్చు. దీనిని కుదుళ్లకు అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం క్లీన్ చేసుకోవడంతో జుట్టుకి బలాన్నిస్తుంది. అలోవెరా జెల్ లో కొద్దిగా ఆముదం నూనె వేసి కుదుళ్లకు అప్లై చేసి.. దాదాపు 30 నిమిషాల పాటు ఉంచిన తరువాత క్లీన్ చేస్తే జుట్టుకు సమతులను పోషకాలు అందుతాయి. అలాగే అలోవెరా జెల్ ను కొద్దిగా యోగర్ట్ కలిపి హెయిర్ మసాజ్ తయారు చేయాలి.

దీనిని కుదుళ్లకు అప్లై చేసి కొద్దిసేపు ఉంచిన తరువాత క్లీన్ చేసుకుంటే చుండ్రు సమస్యలు నయమవుతాయి. అలాగే అలోవెరా గుజ్జులో కొద్దిగా నీళ్లు కలిపి జ్యూస్ లా తయారు చేయండి. ఈ జ్యూస్ తో జుట్టు క్లీన్ చేసుకోవడం ద్వారా కుదుళ్ల పిహెచ్ విలువ సమతుల్యం అవుతుంది. అలాగే అలోవెరా జెల్ లో కోడిగుడ్డు కలిపి మసాజ్ చేయడం ద్వారా పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. అందువల్ల అలోవెరా జెల్ ను ఉపయోగించి పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోండి.