” ది రాజా సాబ్ ” మూవీలో జాయిన్ కానున్న మరో సీనియర్ హీరో… పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ” ది రాజా సాబ్ ” అనే ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీలో తండ్రి పాత్ర కూడా ఉంటుందని.. ఆ పాత్రలో మరో సీనియర్ హీరో కనిపించే అవకాశం ఉందని.. సెకండ్ హాఫ్ లో ఫ్లాప్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర చాలా ఇంట్రెస్ట్ గా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది.

అంతేకాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ కూడా ఇస్తుంది. ఇక ఈ సినిమాలోని విజువల్స్ వండర్ ఫుల్ గా ఉండనున్నాయని.. ముఖ్యంగా ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా త్రిలింగ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ మెయిన్ హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం.