జక్కన్న – మహేష్ మూవీ లాంచింగ్ డేట్ రివిల్… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

కొత్త ఏడాది మొదలైంది. కొత్త ఏడాదిలో కొత్త కొత్త సినిమాలను మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న‌ సినిమాలలో రాజమౌళి మరియు మహేష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై వీరిద్దరి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

మహేష్ మరియు జక్కన్న సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రస్తుతం వినిపిస్తుంది. అదేంటంటే..9, 2024న తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథా నేపథ్యం సాగనున్నట్లు సమాచారం. అయినట్లు విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమని.. అందుమూలంగానే ఆ పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.