వాట్.. సలార్ సినిమాలో ప్రభాస్ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాడా.. చూస్తుంటేనే గూస్బంస్ వస్తున్నాయి గా (వీడియో)

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా లో ప్రభాస్ కటౌట్ ముందు తేలిపోయిన షారుక్ ఖాన్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. కోట్ల మంది మనసులను దోచుకున్న డార్లింగ్ ఈ సినిమాతో మరోసారి తమ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు.

ఇక‌ 2:55 గంటల మూవీలో కేవలం 2.35 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. 2 గంటల 55 నిమిషాల విడివి గల ఈ మూవీలో ప్రభాస్ మాట్లాడింది కేవలం రెండు నిమిషాల 35 సెకండ్లే అయినా ఆ డైలాగులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభాస్ మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక వీడియో గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తమ అభిమానులు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇక ఈ వీడియోని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. అంత బాగా ఎడిట్ చేశారు మరి. ఎంతో అభిమానం ఉంటే గాని ఇలాంటి పనులు చేయరు ఫ్యాన్స్. తమకి డార్లింగ్ మీద ఉన్న ఇష్టాన్ని ఈ విధంగా చూపించుకున్నాడు ఓ అభిమాని. మొత్తానికి ఈ సినిమాతో డార్లింగ్ మంచి సక్సెస్ అందుకున్నాడని చెప్పొచ్చు.