టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన న్యాచురల్ నటనతో లేడీ పవర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్న సాయి పల్లవి సోదరి పూజకనన్ త్వరలోనే పెళ్లి పీటలేకబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన సోదరి నిశ్చితార్థం గ్రాండ్ లెవెల్ లో జరిగింది.
ఇక సాయి పల్లవి డ్యాన్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె తన సోదరి పూజ నిశ్చితార్థంలో కూడా డాన్స్ వేస్తూ తెగ సందడి చేసింది. పూజ కనన్‌ది ప్రేమ వివాహం. తన ప్రియుడు వినీత్ ను ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. పూజ, వినీత్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరు కుటుంబాల సమేతంగా పెళ్లికి సిద్ధమయ్యారు.
ఇటీవల నిశ్చితార్థంలో సాయి పల్లవి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసిన వీడియోలు పూజ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. అయితే ఆమె చెల్లి పూజ కన్నన్ కూడా ఇండస్ట్రీ లో తన అదృష్టని ఓసారి పరీక్షించుకుంది. చిత్తై సవనం అనే సినిమాలో ఈమె నటించింది. తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో అనుకున్న రేంజ్ లో పాపులారిటీ దక్కలేదు.
Sai Pallavi Dance in Her sister’s engagement function ✨💞❤️@Sai_Pallavi92 🤍 #SaiPallavi pic.twitter.com/IKyXmHeOXc
— Sai pallavi (@SaiPallavi92s) January 22, 2024