ఆ విషయంలో బాలీవుడ్ కు షాక్ ఇస్తున్న జక్కన..

రాజమౌళి లాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నిజంగానే టాలీవుడ్‌కు గర్వకారణం అని చెప్పవచ్చు. రాజమౌళి లాంటి విజన్ ఉన్న డైరెక్టర్ ఇండియాలోనే లేడని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయన ఇండియన్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నెంబర్ వన్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు కొత్తగా రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అంటుంటే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.

దాంతో రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు స‌మాచారం. దీన్నిబట్టి రాజమౌళి బాలీవుడ్ డైరెక్టర్స్ కు కూడా తన డైరెక్షన్ తో షాక్ ఇస్తున్నాడని చెప్పాలి. కాగా రాజమౌళిని తక్కువ చేస్తూ బాలీవుడ్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవడంతో.. ఇంకా వీరికి రాజమౌళి స్టామినా పూర్తిగా అర్థమై ఉండదు అంటూ.. కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమా తీస్తున్నాడు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి.

ఇక జక్కన్న సినిమా తెరకెక్కిస్తున్నాడంటే ఆ సినిమా కోసం పూర్తిగా ఎఫ‌ర్ట్ ఇస్తాడు. తన పరిధి నుంచి కష్టపడుతూ అవుట్ పుట్ ఎక్స్ట్రాడినరీగా రావాలని భావిస్తాడు. ప్రస్తుతం రాజమౌళి తనకంటూ ఓ భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుస సినిమాలు తెర‌కెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జక్క‌న మహేష్ బాబు హీరోగా పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు.

ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అందుకుంటే ఇక రాజమౌళిని కొట్టే డైరెక్టర్ ఉండడు అనడంలో సందేహం లేదు. ఆయన చేస్తున్న సినిమాలే ఆయన్ని ఒకో మెట్టు పైకెక్కిస్తూ ఈ రేంజ్ కు తీసుకువచ్చాయి. అయితే రాజమౌళి గురించి ఎలాంటి వారైనా ఎలా మాట్లాడినా సరే ఆయన కీర్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందన‌టంలో సందేహం లేదు. జేమ్స్ కెమెరున్ లాంటి డైరెక్టర్ రాజమౌళిని పిలిచి మీ సినిమాను చూశాను అని చెప్పి ఆయనతో ఐదు నిమిషాలు మాట్లాడదామంటే అది సాధారణ విషయం కాదు.