‘ దేవర ‘ లో జాన్వి కపూర్ పాత్ర కేవలం పాటలకే పరిమితం.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్‌లుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తక్కువ డేట్స్ కేటాయించిందని.. ఈ సినిమాలో జాన్వి కపూర్ చాలా తక్కువ సమయంలో మాత్రమే కనిపిస్తుందని జాన్వి కపూర్ పాత్ర కేవలం పాటలకే పరిమితం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఆ వార్తలపై తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. దేవర సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు ఎక్కువగానే ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది.

Janhvi Kapoor to play an interesting role in Devara? Here's what we know |  Filmfare.com

జాన్వీ కపూర్ కూడా ఓ సందర్భంలో నా కెరీర్ లో మొదటి సినిమా దేవరనే అన్నట్లు అనిపిస్తుంది అంటూ కామెంట్లు చేసింది. బాలీవుడ్ నటులు కూడా దేవరలో నటించడంతో ఆ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేట్ల‌కు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులకు కూడా గట్టిగానే పోటీ నడుస్తుందట. మైత్రి మూవీ మేకర్స్, నిర్మాతలు సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Devara CONFIRMED as two-part saga: First instalment of NTR Jr, Saif Ali  Khan, Janhvi Kapoor starrer gets a release date; deets inside : Bollywood  News - Bollywood Hungama

దేవర సినిమాకు పోటీగా కొన్ని తమిళ‌ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి దేవర సినిమాకు పోటీగా ఏ సినిమా అయినా రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాలి. అయితే దేవర రిలీజ్ డేట్‌ను ఏడాది క్రితం నుంచి మేకర్స్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా 99 శాతం అదే డేట్ న రిలీజ్ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే చివరకు ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలి. ఈ సినిమా కోసం కొరటాల చాలా కష్టపడుతున్నాడట. కొరటాల చివరిగా తెర‌కెక్కించిన ఆచార్య ప్లాప్ కావడంతో.. ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.