ప్రభాస్ ‘ రాజా సాబ్ ‘ సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు నటిస్తూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే ఈ సినిమా త‌ర్వాత‌ ప్రభాస్ యాక్షన్ మోడ్ లోకి మారిపోయాడు. ఇక తాజాగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎప్పుడులా యాక్షన్ మూడ్‌లో కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా కనిపించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ బాగుంటుందని.. ఇందులో ప్రభాస్ ఎప్పుడు కనిపించని విధంగా చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.

Prabhas looks aged for Maruti | cinejosh.com

ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా రాబోతుందట. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది వేచి చూడాలి. ఈ సినిమా విషయంలో మారుతీ కానీ.. ప్రభాస్ కానీ.. చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ సక్సెస్ కొడితేనే మారుతికి మంచి గుర్తింపు వస్తుంది. లేకపోతే ఆయన కెరీర్ డైలమాలో పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు గోపీచంద్ తో తెర‌కెక్కించిన మూవి పక్కా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది.

Allu Arjun to star in Atlee's next? Details inside | Filmfare.com

ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే సినిమాలు మొదటి అల్లు అర్జున్‌తో చేయాలని మారుతి భావించాడట. వాళ్ల కాంబోలో అంతకుముందు ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ అది ఏవో కారణాలతో ఆగిపోయింది. ఇక త‌ర్వాత ఆ సినిమా చేయాలి అనుకున్నాడు.. కానీ అప్పుడు కూడా అల్లు అర్జున్.. కొరటాల శివతో సినిమాకి కమిట్ అవ్వడంతో ఈ సినిమా చేయలేకపోయాడు. దీంతో ఈ స్టోరీ ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది. ఈ సినిమాతో మారుతి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.