ఆసుపత్రిలో జాయిన్ అయిన ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్.. కారణం అదేనా..

ప్రముఖ నటుడు బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలీ ఖాన్ కు టాలీవుడ్ లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆది పురుష్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాలు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇక తాజాగా సేఫ్ అలీ ఖాన్ కు సంబంధించి ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఆసుపత్రి పాలైనట్లు సమాచారం.

Saif Ali Khan from Laal Kaptaan while getting ready for his character lets  see leak photo - बुरे हाल में दिखे सैफ अली खान, आंखों पर है गहरी चोट, लीक  हुई फोटो

మోకాలు, భుజానికి తీవ్ర గాయాలు అయినాయని శాస్త్ర చికిత్స కోసం ముంబైలోని ఓ హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియా ఎక్స్ లోను దీనికి సంబంధించిన పోస్ట్లు కనిపించడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. దేవర యాక్షన్స్ స‌న్నివేశాల షూటింగ్ టైంలో జరిగిన ప్రమాదంతో సైఫ్‌కు గాయాలయ్యాయని తెలుస్తోంది. దీనిపై ఈ న‌టుడు కానీ మూవీ మేకర్స్ కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

Saif Ali Khan office robbery: Police arrests two employees (see pics) –  India TV

ఇక ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ నటిస్తున్న దేవర రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానుంది. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా నిరాదరణకు గురైన సముద్ర తీర ప్రాంతపు ప్రజల లైన్‌తో తెర‌కెక్క‌నుంది. భయం తెలియని మృగాలకు భయాన్ని పరిచయం చేసే శక్తివంతమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాన్నుంది.