సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత కొంతమంది హీరోలు చేయవలసిన సినిమాలను ఏవో కారణాలతో వదులుకోవడం.. అవే సినిమాలను వేరే హీరో నటించి సక్సెస్ అందుకోవడం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సినిమాను వదులుకున్ని.. ఈ సినిమాను అనవసరంగా వదులుకున్నాము అని బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఓ సినిమాను రిజెక్ట్ చేశానని బాధపడిన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. పాన్ ఇండియా స్టార్ హీరోగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. గ్లోబల్ స్టార్ గా బిరుదును దక్కించుకున్నాడు.
ఇలా స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్న ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ.. భద్రా సినిమాను నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మొదటగా ఎన్టీఆర్‌ను హీరోగా అనుకున్నాడట బోయపాటి. ఎన్టీఆర్‌కు ఈ కథను వినిపించగా మొత్తం విన్న ఎన్టీఆర్.. బోయపాటికి ఇండస్ట్రీ కొత్త కావడం.. అలాగే కథ చెప్పడంలో పలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. డౌట్ వచ్చి ఈ సినిమాను చేయడానికి ఆసక్తి చూపలేదట ఎన్టీఆర్.
దీంతో ఈ సినిమా రవితేజ వద్దకు వెళ్ళింది. ఆయన ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విధంగా రవితేజ, మీరాజాస్మిన్.. హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన భద్రా సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాని వదులుకొని నేను చాలా తప్పు చేశాను అని ఎన్టీఆర్ బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఏది ఏమైనా ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో బ్లాక్‌బాస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడట.