జూనియర్ ఎన్టీఆర్ కు భార్య లక్ష్మీ ప్రణతిలో ఆ క్వాలిటీ అస‌లు న‌చ్చ‌దా అదేంటో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఏ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ అండర్ వాటర్ ఫైట్లను చేస్తాడని.. దీనికోసం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంటూ.. వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా కోసం హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఏవో కారణాల‌తో అజ్ఞాతానికి వెళ్లిన ఎన్టీఆర్ తన కుటుంబాన్ని నమ్ముకున్న తీర ప్రాంత ప్రజలను రక్షించడానికి అజ్ఞాతం నుంచి బయటకు వస్తాడని.. ఈ సినిమాలో కథనం వైవిద్యంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణీతికి సంబంధించిన న్యూస్ కూడా వైరల్ అవుతుంది. లక్ష్మీ ప్రణతికి మొహమాటం ఎక్కువట. తాను ఏదైనా చెబితే అవతలి వాళ్ళ హర్ట్ అవుతారేమోనని భయంతో మనసులో మాట చెప్పకుండా ఆగిపోతుందట.

అయితే లక్ష్మీ ప్రణతి నీ ఈ విషయంలో ఎలాగైనా మార్చాలని తారక్ చాలా సార్లు ప్రయత్నించాడట. అయినా వర్కౌట్ కాలేదని.. అయితే ఈ ఒక్క విషయాన్ని వదిలేస్తే లక్ష్మీ ప్రణతి మిగతా విషయాలన్నిటిలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని.. జూనియర్ ఎన్టీఆర్ ఫీలవుతారట. ఇక 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లీస్ట్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ అయిన వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.