భ‌ర్త‌ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆలియా.. ఆనందంలో ఏం చేసిందంటే..?!

రణ్‌బీర్ కపూర్ – రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ యానిమల్. భారీ అంచనాల మధ్య రిలీజైన‌ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకొని భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సౌత్ లో మిక్స్డ్ టాక్ వచ్చిన నార్త్ లో ఈ సినిమాను ఓ క‌ల్ట్‌ మూవీ గా తీసుకుంటున్నారు. ఇక రణ్‌బీర్ కెరీర్ లోనే యానిమల్ మైలురాయిగా నిలిచిపోతుందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. అభిమానులతో పాటుగా, రణ్‌బీర్ భార్య ఆలియా భట్ కూడా సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తుంది.

తన సంతోషాన్ని భర్త.. నటినట్లు గురించి ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె త‌న స్టోరీలో కెమెరా ముందు, వెనక ఎంతో ప్రేమ, ఓప్పిక‌తో కుటుంబం పై, సినిమాపై నీ అన్‌కండిషనల్‌ ప్రేమను పంచుతూ.. నటుడిగా పెద్ద స్థాయికి ఎదిగావు. నీ హార్డ్ వర్క్ యాక్టింగ్ తో ఎప్పుడు ముందడుగులు వేస్తూనే ఉంటావు. మన పాపకు మంచి లక్ష్యాలను అందించావ్. మేము గర్వపడేలా చేసావ్ అంటూ రాసుకొచ్చింది. యు ఆర్ మై నాట్ సో లిటిల్ అనివల్ అంటూ వివరించిన ఆలియా

సందీప్ రెడ్డి గురించి మాట్లాడుతూ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో బీట్స్, షూటింగ్లో మొత్తం షాకింగ్ గా, నమ్మలేని విధంగా గూస్‌బ‌మ్స్‌ తెచ్చేలా మీ ఇమేజినేషన్స్ ఉంటాయి. కొద్ది రోజులపాటు మీ సినిమా గుర్తుకొస్తూనే ఉంటుంది. రష్మిక మీరు ఎంతో అందంగా, నిజాయితీగా ఉంటారు. నేను అంతకుముందు చెప్పినట్లు సెకండ్ హాఫ్ లో మీ సీన్స్ చాలా బాగా నచ్చాయి. ఫ్యాన్ క్లబ్ చేరడానికి సిద్ధంగా ఉన్నా క్ర‌ష్మిక అంటూ మూవీ టీం ను ఓ రేంజ్ లో పొగిడేసింది.