ఈ పిక్ లో విజ‌య్‌ పెట్టుకున్న గాగుల్స్‌ టు కాస్ట్లీ.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఓవర్‌నైట్ స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలస ఖుషి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న రౌడీ హీరో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ హీరోయిన్గా నటిస్తుంది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో పాటు విజయ్ మరో రెండు ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పాడు.

ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తేనే మరోవైపు వ్యాపారం రంగంలోనూ దూసుకుపోతున్నాడు విజయ్. తన సొంత క్లాత్ బ్రాండ్ రౌడి ఉత్పత్తులను సైతం ప్రమోట్ చేస్తున్నాడు. ఇక అసలు విషయానికొస్తే ఇటీవల కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ వేసుకుంటున్న షర్ట్ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్ వరకు అన్ని వాటి కాస్ట్లతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎలక్షన్స్ నేపథ్యంలో ఓటు వేయడానికి వచ్చి తన లుక్ తో అందరిని ఆకట్టుకున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గురువారం ఓటు వేయడానికి వెళ్లిన రౌడీ హుడీలో కనిపించి అందరి దృష్టిని త‌న వైపు తిప్పుకున్నాడు.

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ విజయ్ తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నాడు. మోజోయి పేసులతో సెట్ చేసిన చిక్ ఆఫ్ వైట్ హుడి తో పాటు.. బ్రాండెడ్ గాగుల్స్‌ని పెట్టుకున్నాడు. సెలెబ్రిటీ అవుట్ ఫిట్స్ ఢీకొడ్ అనే ఇన్‌స్టా పేజీ ప్రకారం విజయ ధరించిన స్టైలిష్ గూగుల్ రేటు రూ.1. 58 లక్షల అని తెలుస్తుంది. అయితే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ కేవలం గూగుల్స్‌కే లక్షల్లో డబ్బు ఖర్చు పెడుతున్నాడు అంటే ఇక తను వేసుకున్న వస్తువులన్నిటికీ ఎంత ఖర్చు పెట్టి ఉంటాడో అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్స్.