మెగాస్టార్ మూవీలో ప‌వ‌ర్ స్టార్‌.. ఎన్ని నిమిషాలు క‌నిపిస్తాడంటే..?

టిలీవుడ్ సీనియ‌ర్ స్టార్‌హీరో చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్ బిరుదు అందుకున్నాడు. ఇక చిరంజీవి ఓ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి తన ఫ్యామిలీ నుంచి ఎంతోమంది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే చిరంజీవి కెరీర్ స్టార్టింగ్‌లో ఏదైనా సినిమా విషయంలో కథపరంగా లోటుగా ఉందనిపిస్తే తన ఆస్థాన రైటర్ అయిన పరుచూరి బ్రదర్స్, యండమూరి వీరేంద్రనాథ్, సత్యనాథ్ ఇలా పలువురు రైటర్లను కూర్చోబెట్టి ఆ కథలలో మార్పులు, చేర్పులు చేసి మరి సినిమాలో నటించేవారట.

Mega 156 Movie Title : చిరు సినిమాకు సూపర్ టైటిల్​.. దీని వెనుక పెద్ద  స్టోరీనే ఉందిగా!, mega-156-movie-chiranjeevi-vashista-movie-title -to-be-fixed-as-viswambara-says-sources

అందుకే ఆయన సినిమాలు చాలా వరకు అప్పట్లో సక్సెస్ అయ్యేవ‌ని టాక్‌. ఇక మొదటి నుంచే మంచి కంటెంట్ ఇచ్చే డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ వచ్చే చిరంజీవి.. తాజాగా నటిస్తున్న విశ్వంభ‌రా సినిమాతో యంగ్ డైరెక్టర్ వశిష్టని ఎంకరేజ్ చేస్తూ ఆయన డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు ఓ చిన్న కీరోల్‌ కోసం పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి నటిస్తున్నాడట.

Pawan Kalyan Recalls Wanting To Kill Himself With Chiranjeevi's Gun, "Felt  Isolated Due To Frequent Hospitalisation..."

అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన స్టోరీ లైన్ గురించి చర్చలు జరిగాయని మొత్తానికి ఆ చిన్న క్యారెక్టర్ లో పవన్ నటించిన ఓకే చేసినట్లు తెలుస్తోంది. పాత్ర న‌డివి కూడా 15- 30 నిమిషాల‌లోపు ఉంటుంద‌ట‌. అయితే ఇప్పుడు ఎలక్షన్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటున్నాడు. దీంతో షూట్ కి రావడం కుదరదు. అందుకే ఎలక్షన్స్ తరువాత ఈ షూటింగ్‌లో పవన్ పాల్గొంటాడట. అప్పటి వరకు చిరంజీవి సన్నివేశాలను షూట్ చేసి.. పవన్‌కి వీలు కుదిరినప్పుడు తనను ఇన్వాల్వ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.