అక్క‌డ ‘ స‌హ‌దేవ్ ‘ టైటిల్‌తో రిలీజ్ కానున్న ‘ ఈగిల్ ‘ .. కార‌ణం ఏంటంటే..?

మాస్ మహారాజు రవితేజ ఇటీవల హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇక ఈ సినిమాతో మాస్ మహారాజ్ బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్టోబర్ 19 దసరా కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. ఎక్కువ రెన్‌ టైంతో రిలీజ్ అయిన ఈ సినిమా మొదట్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకోలేక‌పోయింది.

Eagle Cast And Crew, Hit Or Flop, Box Office, Release Date And Wikipedia

20 నిమిషాల న‌డివి మేకర్స్ తగ్గించి రిలీజ్ చేయగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మిక్స్డ్‌ టాక్ వచ్చింది. అయితే ఓ మోస్తారు కలెక్షన్స్‌తో సినిమా సరిపెట్టుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయినా ఈ మూవీ బాలీవుడ్‌లో దక్షిణాదిలోను రెండు చోట్ల ప్రభావం చూపించలేకపోయింది. అయితే తాజాగా రవితేజ నటించిన మూవీ ఈగిల్. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. సినిమా ఆటోగ్రాఫర్‌గా, డైరెక్టర్ గా కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా, కావ్య థాపర్ కీలకపాత్రలో నటించారు.

ఈగల్'.. హిందీలో డిఫరెంట్ టైటిల్ తో అదే టీజర్ | Sahadev - Eagle Hindi Teaser  Ravi Teja

సంక్రాంతి బరిలో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ను అందించారు. ఈ మూవీని హిందీలో సహదేవ్ అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈగిల్ మూవీలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కేవలం బాలీవుడ్‌లో మాత్రమే సహదేవ్ అనే పేరుతో సినిమా రిలీజ్ చేయడం పై ప్రేక్షకుల్లో పలు సందేహాలు మొదలయ్యాయి. అక్కడ ఆ పేరుతో రిలీజ్ చేయడానికి అంత స్పెషల్ ఏంటి అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు వినపడుతున్నాయి.