అనుష్క చెప్పిన ఆ ఒక్క మాట‌తో రాజ‌మౌళి హ‌ర్ట్ బ్రేక్ అయ్యిందా..!

అనుష్క శెట్టి హీరోయిన్ గా రాజమౌళి కాంబినేషన్లో ” బాహుబలి ష‌ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆ పాత్రకి అనుష్క తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ప్రేక్షకులని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా స్టోరీ గురించి రాజమౌళి.. అనుష్కకి చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాడట. రాజమౌళి స్టోరీ చెప్పడం పూర్తి అయ్యాక… బాల్లాల‌ దేవని చంపేసేది నేనే అని చాలా ఎక్సయిట్ అయిపోయిందట స్వీటీ. దీంతో రాజమౌళి కూడా చాలా సంతోషపడ్డాడట. అనుష్కకి ఈ సినిమా స్టోరీ చాలా నచ్చింది అంటూ తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయాడట.

అయితే.. అన్ని ఒకే అయ్యి సెట్స్ పై కూడా సందడి మొదలైంది. ఈ సినిమా రిలీజ్ కు కూడా రెడీ అయిపోయింది. ఇక ప్రమోషన్స్ టైం లో ఏదో ఓ సందర్భంలో అనుష్క ని ఓ ప్రశ్న అడిగాడట రాజమౌళి. బాహుబలి సినిమాకు మీరు ఎందుకు ఒకే చెప్పారు అనే ప్రశ్నకి.. అనుష్క క్యూట్ గా సమాధానం ఇచ్చిందట. కానీ ఆ ఆన్సర్ కే రాజమౌళి కి గుండె పగిలే షాప్ తగిలిందట.

ఇంతకీ అనుష్క ఏం ఆన్సర్ ఇచ్చిందంటే…” బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, రాజమౌళి వైఫ్ రమ రాజమౌళి.. వీళ్లంతా నాకు మంచి ఫ్రెండ్స్. వీళ్లంతా కలిసి సెట్స్ లో సందడి చేస్తుంటే.. నేను మాత్రం ఒక్కదాన్నే ఉండాలా? అందుకే ఈ సినిమాకి ఓకే చెప్పా ” అని చెప్పిందట అనుష్క. దీంతో రాజమౌళి షాక్ కి గురయ్యాడట. మూవీ స్టోరీ అంత కష్టపడి చెబితే.. మూవీ స్టోరీ నచ్చి సినిమా ఓకే చేశారని అనుకున్నాను అని… అసలు కారణం ఇదే అని తెలియదని వాపోయాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.