‘ స‌లార్ ‘ కథ‌కు ప్రధాన బలం ఆ స‌నివేశాలే.. ఇప్పటివరకు చూడని పాత్రలో నన్ను చూస్తారు.. ప్రభాస్

పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. కే జి ఎఫ్ సిరీస్‌ల‌ తర్వాత ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్గా హోంబాలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో నటించారు. మొదటి భాగం.. స‌లార్ సీజ్‌ ఫైర్ ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమాలో పాత్రల మధ్య బలమైన భావోద్వేగాలు ఉంటాయని.. సలార్ సినిమాకి ప్రధాన బలం ఆ సన్నివేశాలే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడనటువంటి పాత్రలో నేను కనిపించబోతున్నా.. ప్రశాంత్ నాతో సినిమా చేయాలి అన్నప్పుడు సినిమా ఎలా ఉంటే అందరిని ఆకట్టుకుంటుంది అనే అంశంపై మేము చర్చించాం.. నేను నా ఆలోచనలు ప్ర‌శాంత్‌తో షేర్ చేసుకున్నా.. తను.. నన్ను ఎలా చూపించాలి అనుకునే విషయాన్ని వివరించాడు.

Salaar director Prashanth Neel reveals plot details of Prabhas starrer |  Filmfare.com

మేము అనుకున్న స్టోరీకి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి.. అనే విషయాన్ని కూడా మేము చర్చించాం.. నేను చెప్పిన వాటిలో కొన్ని ఆలోచనలు ప్రశాంత్‌కి నచ్చాయి. అలాగే తాను నన్నెలా చూపించాలి అనుకున్న విధానం నాకు నచ్చింది. అలా ఇద్దరం కలిసి వర్క్ షాప్ చేసి సరదాగా సినిమా కంప్లీట్ చేశాం అంటూ వివ‌రించాడు. నా సినీ కెరీర్ ప్రారంభమై 21 ఏళ్లు అవుతుంది. ప్రశాంత్‌తో ఎప్పుడు సినిమా చేస్తానా అంటూ వెయిట్ చేశా.. నా ఇన్నేళ్ల కెరీర్‌లో నేను ఎప్పుడూ అలా ఎదురు చూడలేదు.. స‌లార్‌ సినిమా షూటింగ్ మొదలైన నెల రోజుల్లోనే మేమిద్దరం మంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం.

Bollywood macho hero to turn villain for Prabhas's Salaar -  TeluguBulletin.com

హీరోలని గొప్పగా చూపించాలి అనే ఆలోచనలో ప్రశాంత్ ఉంటాడు. ఈ సినిమా కోసం నేను ప్రత్యేకంగా ఏం కష్టపడలేదు. పాత్ర డిమాండ్ మేరకు కండలు పెంచాలని ప్రశాంత్ చెప్పాడు.. నేను తను చెప్పినట్లే మారా.. అయితే గత 21 ఏళ్లలో నేను మారిన దానితో పోల్చుకుంటే.. ఈ సినిమా కోసం నాలో వచ్చిన మార్పులు చాలా సాధారణం. ఇక పృథ్వీరాజ్, శృతిహాసన్ తో కలిసి పని చేయడం నాకు చాలా నచ్చింది. మేమంతా సెట్స్‌లో కలిసామంటే సందడి సందడిగా టైం అయిపోయేది అంటూ వివరించాడు.