రాజ‌మౌళి బాల‌న‌టుడిగా చేసిన తెలుగు సినిమా ఇదే..!

పాన్ ఇండియా డైరెక్టర్గా ఎస్ ఎస్ రాజమౌళి ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసిందే. తన సినీ కెరీర్ లో అసలు ఫ్లాప్ అంటే చూడని డైరెక్టర్లలో రాజమౌళి ఒకడు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఇమేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. ఇక అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు రాజమౌళి. ఇకపోతే రాజమౌళి డైరెక్టర్ గానే కాదు నటుడు కూడా.

ఈయన నటుడు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక రాజ‌మౌళి తన సినిమాలలో హీరోలకు సీన్ వినిపించేటప్పుడు నటించి చూపిస్తాడట. అది మాత్రమే కాదు రాజమౌళి ఒక సినిమాలో బాల నటుడుగా కూడా వెండితెరపై కనిపించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి నటించిన సినిమా దగ్గరికి వస్తే… ఈయన బాల నటుడుగా ” పిల్లనగ్రోవి ” అనే సినిమాలో నటించాడు.

1983లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అప్పటికి రాజమౌళి వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. రాజమౌళి బాడ్ లక్ ఏమిటంటే ఈ సినిమా అప్పుడు విడుదల కాలేదు. అయితే ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ చేస్తారా అంటే ఆ ఊసే లేదు. ఇక తను కూడా ఓ సినిమాలో బాల నటుడుగా చేసిన విషయాన్ని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో స్వయంగా తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.