2023లో పెళ్లి చేసుకున్న సినీ సెల‌బ్రిటీలు వీళ్లే….!

2003 వ సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోల యొక్క ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం మూడు ముళ్ళు బంధంతో ఒక్కటైన సినీ సెలబ్రిటీలు ఎవ్వరో ఇప్పుడు చూద్దాం.

1. మంచు మనోజ్ – భూమా మౌనిక:


ఈ ఇద్దరు ఈ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరికీ ఇది రెండవ వివాహం. వీళ్ళిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో.. మంచు లక్ష్మి నివాసంలో వివాహం చేసుకున్నారు.

2. శర్వానంద్ – రక్షిత రెడ్డి:


ఈ జంట జూన్ నెలలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి రాజస్థాన్లో జరిగింది. అనంతరం హైదరాబాద్లో రిసెప్షన్ సైతం జరుపుకున్నారు.

3. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి:


ఈ అందాల జంట గత నెల నవంబర్ 1న మూడు ముళ్ల‌ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఎంతో ఘనంగా ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం వీరు కూడా హైదరాబాద్లో గ్రాండ్ గా రిసెప్షన్ జరుపుకున్నారు.

4. అభిరామ్ – ప్రత్యూష:


దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన అభిరామ్ పెళ్లి శ్రీలంకలో జరిగింది. వీరి కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరూ ఒకటయ్యారు.

ఇలా 2003 కొంతమందికి అన్యాయం చేసిన సినీ సెలబ్రిటీలకు న్యాయం చేసిందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించని వారు కూడా ఈ సంవత్సరంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైపోయారు. ఇక ఇలా 2003 వ సంవత్సరంలో వివాహం లిస్టులో చేరారు ఈ జంటలు.