త‌మ్ముడు నాగ‌బాబును నిలువునా ముంచేసిన చిరంజీవి… !

మనం ఒక్కరం మాత్రమే బ్రతకడం కాదు మన చుట్టూ ఉన్న వారిని కూడా బ్రతికించాలి అనే కథాంశంతో నిర్మాతగా వ్యవహరిస్తూ రుద్రవీణను నిర్మించాడు నాగబాబు. ఇలా తొలిసారి తన అన్నని హీరోగా ఎంచుకుంటూ.. తన అన్న పాపులారిటీతో పైకి వచ్చాడు నాగబాబు. కానీ డబ్బులు మాత్రం రాలేదు. చిరంజీవి కల్ట్ క్లాసిక్ సినిమాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాని కె బాలచందర్ గారు తెరకెక్కించారు. ఇక అనంతరం చిరంజీవితో త్రినేత్రుడు అనే సినిమాని నిర్మించాడు నాగబాబు. ఇది 1988లో రిలీజ్ అయింది.

ఇక ఈ సినిమా చిరంజీవి 100వ సినిమాగా తెరకెక్కింది. ఇక చిరు సినిమా కావడంతో ఈ మూవీపై భారీ హైప్స్ నెలకున్నాయి. కానీ ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఇక మూడోసారి ముచ్చటిగా ముగ్గురు మొనగాళ్లు అనే సినిమాను నిర్మించాడు నాగబాబు. ఈ సినిమా లాభాల పరంగా నిరాశ పరిస్థితి యావరేజ్ గా నిలిచింది. ఇక ఈ సినిమాని రాఘవేంద్ర రావు 1994లో. ఇక అనంతరం నాలుగేళ్ల తర్వాత చిరంజీవి గారితో నాలుగవ సినిమా చేశాడు.

ఈ సినిమా పేరు బావగారు బాగున్నారా. ఇక ఈ సినిమా చిరంజీవి తన కామెడీతో ఆకట్టుకోవడంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఇక అనంతరం నాగబాబు.. చిరంజీవితో మరో సినిమా తీసినప్పటికీ అది కూడా బోల్తా పడింది. ఇలా చిరుతో తీసిన ఐదు సినిమాలలో ఒక్క సినిమా మాత్రమే హిట్ అయింది. ఈ విషయంలో చిరు నాగబాబుకి భారీ నష్టాలనే తెచ్చి పెట్టాడని చెప్పాలి.