బుక్ మై షోలో ” సలార్ ” హవా… తగ్గేదేలే అంటున్న ప్రభాస్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచి నేటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా సలార్ మూవీ ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో లో వన్ మిలియన్ ఇంట్రెస్ట్ లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ ని సలార్ మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ కూడా వన్ మిలియన్ కి పైగా ఇంట్రెస్ట్ లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సలార్ తో మరోసారి తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. ఇక డిసెంబర్ (ఈనెల)22న రిలీజ్ కానున్న ఈ మూవీ తప్పకుండా విజయవంతం అవుతుందని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక రిలీజ్ అనంతరం ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా అట్రాక్ట్ చేస్తుందో చూడాలి మరి.