అలాంటి ఫొటోలతో సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న శ్రియా… గ్రేట్ ఉమెన్…!

హీరోయిన్ శ్రియ మనందరికీ సుపరిచితమే. బాలయ్య, ప్రభాస్, నాగార్జున వంటి అగ్ర హీరోల సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఈమె ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తుంది. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ… ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ని ప్రేక్షకులతో పంచుకుంటుంది.

భార్య, కూతుర్లతో ఈమె ఎంత హ్యాపీగా గడుపుతుందో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటూ నే ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలు షేర్ చేసిన ఐదు నిమిషాలకే లైకుల వర్షం కురిపించారు ప్రేక్షకులు.

ఈమె 19 మార్చ్ 2018 న తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొస్సీవ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం జనవరి 10 2021లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆమెకి రాధా అనే పేరు కూడా పెట్టింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ” నరగసూరన్ ష‌ అనే సినిమాలో నటిస్తుంది. ఇక ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.