స‌లార్ ఫ‌స్ట్ టిక్కెట్ కొన్న రాజ‌మౌళి… భారీ రేటు పెట్టేసిన జ‌క్క‌న్న‌…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ స‌లార్‌. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తెర‌కెక్కుతున్న సినిమా కావడం.. అలాగే పాన్ ఇండియ‌న్ స్టార్‌ ప్రభాస్ నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి హైప్‌ నెలకొంది. ఇక డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టికెట్స్ బుకింగ్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

Salaar: Makers Call Prabhas & KGF Chapter 2 Director Prashant Neel A  'Deadly Combination', Reveal 'Setting The Bar High' For Fans

అయితే మూవీ మొదటి టికెట్ భారీ ధ‌రకి దర్శక ధీరుడు రాజమౌళి దక్కించుకున్నాడట. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి హోస్ట్గా ఓ ఇంటర్వ్యూ చేయబోతున్నారని.. ప్రశాంత్ నీల్‌, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారని టాక్‌. ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి.. సలార్ మొదటి టికెట్ ను భారీ బడ్జెట్ కు కొనుగోలు చేసినట్లు టాక్. ఏకంగా రూ.10,116లు పెట్టి మరీ సలార్ టికెట్ను జక్కన్న సొంతం చేసుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట‌ వైరల్ గా మారింది. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Salaar: Rajamouli Konnaroch is the first ticket of 'Salar' - Prabhas who  has come out on top - Celtalks

ప్రభాస్‌ని ఓ సినిమాలో కాకుండా.. షోలో చూసి చాలా కాలం అవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా సలార్‌లో శృతిహాసన్, పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రచారం మొదలైంది. మొదటి ట్రైలర్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన సెకండ్ ట్రైలర్ త్వ‌క‌లోనే రిలీజ్ కాబోతుందని.. అది మంచి యాక్షన్ కట్‌లతో ఉండబోతుందని టాక్. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సలారోడు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడు వేచి చూడాలి.