గ్రాండ్ ఫినాలే సీక్రెట్ రివిల్.. హౌస్‌లోకి శ్రీముఖి తీసుకెళ్లిన రు. 20 ల‌క్ష‌లు ఎవ‌రు కొట్టేశారంటే..!

గ్రాండ్గా జరగబోతుంది. అయితే ఇటీవల ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలైందట. ఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఫినాలేలో ముగ్గురు, నలుగురు సభ్యులు హౌస్ లో ఉన్నప్పుడు నాగార్జున కొందరు గెస్ట్‌లని లోపలికి పంపి.. డబ్బు ఆశ చూపించి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించ‌డ్ ఎప్పుడు కామన్ గానే జరుగుతుంది.

Sree Mukhi Movies, News, Photos, Age, Biography

గత ఫైనల్‌లో గమనిస్తే ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయిన తరువాత ఇలా డబ్బు ఆశ చూపించాడు బిగ్‌బాస్‌. అయితే ఈ సీజన్లో మొదటి నుంచే ఆట‌లో హీట్ పెంచేశాడు. తాజా సమాచారం ప్రకారం యాంకర్ శ్రీముఖి బిగినింగ్ లోనే హౌస్ లోకి రూ.20 లక్షల నగదు ఉన్న సూట్ కేసును తీసుకువెళ్తుందట. ప్రస్తుతం హౌస్ లో టాప్ సిక్స్ కంటెస్ట్ ఉండగా ర‌త నాలుగు రోజులుగా ఫినాలే వరకు కేవలం ఐదుగురు వెళ్తారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అంటూ వచ్చిన రూమర్లకు చెక్ పడింది. అయితే హౌస్ లో ఆరుగురికి శ్రీముఖి రూ.20 లక్షల డబ్బు ఆశ చూపించిందట.

ఆ డబ్బు వాళ్ళు సొంతం చేసుకోవడానికి చాలా టెంప్ట్ చేయడానికి ప్రయత్నించిందని.. కానీ ఎవరు ఆ డబ్బు తీసుకోవడానికి ముందుకు రాలేదంటూ తెలుస్తుంది. ఓటింగ్‌లో లాస్ట్ లో ఉన్నామని అనుకునే వారికి ఇది గోల్డెన్ ఆఫర్ అంటూ శ్రీముఖి చాలా రెచ్చగొట్టిందట. కానీ ఆ ఆఫర్ను అందరూ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. స్టార్టింగ్ లోనే హీరోయిన్స్ లో డబ్బు ఆశ చూపించాడు అంటే.. ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యేకొద్దీ ఆఫర్ కూడా అదే రేంజ్‌లో పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.

శివాజీ, పల్లవి ప్రశాంత్ ఓటింగ్ లో మోసాలు..! | Sivaji, Pallavi Prashanth  cheated in voting

ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం మేకర్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారట. ఇక ఫైనల్ టైటిల్ విన్నర్ ఎవరో అవుతారని ఈ ఎపిసోడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా చూడాలని ఉద్దేశంతోనే ఎన్నో ట్విస్ట్‌లతో షోని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారం శివాజీ, అమర్,ప్రశాంత్‌ మధ్య టైటిల్ పోరు జరగబోతుందని తెలుస్తుంది. ఈ ముగ్గురిలో పల్లవి ప్రశాంత్ మొదటి వరుసలో ఉన్నాడు.