ఆ స్టార్ హీరోయిన్ ని గుర్తు చేసుకుని అలా మాట్లాడిన జాన్వి కపూర్… ఆ పని చేశానంటూ రివిల్…!!

దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నటి జాన్వి కపూర్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ షూటింగ్ పనులలో బిజీగా ఉంది. ఈ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. ఇకపోతే తరచూ ఈమె తన తల్లి గురించి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన తల్లిని గుర్తు చేసుకుంటూ జాన్వి కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ…” నేను శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చానని తనకు అందుకే అవకాశాలు వస్తున్నాయి అంటూ చాలామంది మాట్లాడేవారు. అందుకే నేనంటే ఏంటో నిరూపించుకోవడం కోసమే అప్పట్లో సినిమాలకు సంబంధించిన సలహాలు అమ్మని అడిగి తెలుసుకునే దానినే కాదు.

అంతే కాకుండా నేను సినిమా షూటింగ్ కు వెళ్తే అమ్మని నా వెంట అస్సలు తీసుకెళ్లే దాన్ని కాదు. ధడక్ మూవీ షూటింగ్ సమయంలో అమ్మ నా వెంట వస్తానని చెప్పినప్పటికీ నేను అక్కడ అస్సలు ఒప్పుకోలేదు. అసలు అమ్మను నా వెంట అస్సలు తీసుకెళ్లే దానినే కాదు. ఇక అందుకే నా సినిమా షూటింగ్ సమయంలో అమ్మను నేను దూరం పెట్టేదాన్ని ” అంటూ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆ విషయాలు గుర్తుకు వస్తే తనకు చాలా సిల్లీగా అనిపిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈమె తన తల్లి గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.