ఇది ప్ర‌భాస్‌ రేంజ్.. హెలికాప్టర్ల‌తో స‌లార్ మూవీ ప్రమోషన్లు..

పాన్ ఇండియా లెవెల్ లో సలార్ మానియా జోరుగా కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల జోరందుకున్నాయి. నిర్మాత విజయ్ కిరంగ‌దూర్‌ కూడా మూవీ ప్రమోషన్స్ జోరు పెంచాడు. వరుస ఇంటర్వ్యూ లతో స‌లార్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూన్నాడు.

ఈ క్ర‌మంలోనే డైనోసార్.. ప్ర‌భాస్ కూడా ఇంటర్వ్యూ తో ఎంట్రీ ఇచ్చి సినిమాపై ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇదే నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డార్లింగ్‌పై తమ‌ అభిమానాన్ని ఎన్నో విధాలుగా తెలియజేస్తున్నారు. తాజాగా కనడ లోని ప్రభాస్ ఫ్యాన్స్ డిఫరెంట్‌ వేలో భారీ ఎత్తున ప్రదర్శన చేశారు. హెలికాప్టర్లతో ప్రభాస్‌కి ఎయిర్ సెల్యూట్ చేశారు.

కెనడాలోని టొరంటోలో పచ్చని మైదానంలో ప్రభాస్ భారీ పోస్టర్ ఏర్పాటు చేసి అదే టైంలో 6 హెలికాప్టర్లను ఒకేసారి గాలిలోకి ఎగరవేశారు. అవన్నీ ప్రభాస్‌కి సెల్యూట్ చేస్తున్నట్లుగా వీడియో ఎడిట్ చేశారు. ఎంతో కష్టపడి ప్రభాస్ పై అభిమానంతో ఈ వీడియోని అద్భుతంగా రూపొందించారు ప్రభాస్ ఫ్యాన్స్. హోంబాలే ఫిలిమ్స్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ వీడియోను ఫాన్స్ బాగా వైరల్ చేస్తు ఇది ప్రభాస్ రాజు రేంజ్.. ప్రభాస్ రాజ్ ర్యాంపేజ్ మొదలైంది గురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అశిమానులు