బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 7 సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ సీజన్.. గత సీజన్స్ కంటే కాస్త ఆసక్తికరంగా ఉంది. ఇక ఆరు సీజన్స్ లో కనిపిస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తున్న నాగార్జున.. ఏడో సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈయన వేసుకున్న బట్టల దగ్గర నుంచి.. కాళ్లకున్న షూస్ వరకు ప్రతి దాని ధర గురించి ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు. గత శనివారం కూడా నాగార్జున ఓ రంగుల చొక్కాను ధరించి హోస్టింగ్ చేశాడు.
ఈ షర్ట్ ధర లక్షల్లో ఉంది. అయితే ఆ షర్ట్ తో పాటు ఆరోజు నాగార్జున చేతికి ధరించిన ఓ బ్యాండ్ పై ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. చూడడానికి అది స్మార్ట్ వాచ్ లా కనిపించిన.. దాని వెనక మాత్రం చాలా కదే ఉంది. అదొక ఫిట్నెస్ ట్రాకర్. దాని ద్వారా మన శరీర భాగాల పనితీరును తెలుసుకోవచ్చు. మన బాడీలోని ఒత్తిడి, బీపీ, హార్ట్ బీట్, పల్స్ రేట్ ను అది ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. అయితే దీనికోసం మన మొబైల్ లో యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ బ్యాండ్ ని చేతికి ధరించి.. శరీర భాగాల పనితీరుని మొబైల్లో చూసుకోవచ్చు. అయితే అది స్మార్ట్ వాచ్ లా ఒకసారి కొంటే.. ఎప్పటికీ పనిచేసే పరికరం కాదు. ఫిట్నెస్ ని తీసుకోవడం కోసం ప్రతి నెల రీచార్జ్ చేసుకోవాలి. ఇలాంటి ఫిట్నెస్ ట్లాకర్ ని ధరించాలంటే ఏడాదికి రూ. 25 వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నెలనెలా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ తరహా బ్యాండ్ లను సీని సెలెబ్రెటీలతోపాటు క్రీడాకారులు కూడా ఎక్కువగా ధరిస్తున్నారు.